ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురికి కాలువలో వైసీపీ ఎమ్మెల్యే నిర‌స‌న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 01:05 PM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తాజాగా మరోసారి మురికి కాలువలోకి దిగి నిరసన చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు పరిధిలోని ఉమ్మారెడ్డిగుంటలో కొన్నాళ్లుగా మురికికాల్వ సమస్య ఉందన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల తీరు బాగోలేదని,లిఖితపూర్వక హమీ ఇచ్చి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కాలేదంటూ మురికి కాలువలో దిగి నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com