పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం పాలిథిన్ సంచులపై విధించిన నిషేధం శుక్రవారం నుండి అమలులోకి రానుంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒకసారి వాడి పడేసే పాలిథిన్ సంచులపై నిషేధం విధించారు.
నిషేధాన్ని ఉల్లంఘిస్తే పర్యావరణ చట్టం 1986 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష, లేదా రెండు విధించే అవకాశం ఉంది.