ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 08:13 PM

మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు అంటూ వైసీపీ మూడేళ్ల పాలనపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర  సెటైర్లు వేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ద‌క్కిన విజ‌యానికి మూడేళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే... ఆ విజ‌యంపై విప‌క్ష టీడీపీ సెటైర్లు సంధించింది. ఇందులో భాగంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీ విజ‌యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు అంటూ ఆయ‌న సెటైర్ సంధించారు.


ఒక్క ఛాన్స్ మీ చివ‌రి ఛాన్స్ కావ‌బోతుంది అంటూ కొల్లు ర‌వీంద్ర త‌న ట్వీట్‌లో వైసీపీని హెచ్చ‌రించారు. మూడేళ్లు అయ్యాయి అని వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే.. ఎంత తొందరగా ఈ పీడ పోతుందో అని ప్రజలు వేచి చూస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. మీ శేష జీవితం ఎలా బతకాలో ఈ రెండేళ్లలో చూస్కోండి అంటూ వైసీపీ నేత‌ల‌కు సూచించిన కొల్లు... ఈ ఎన్నికలు మీ పార్టీకి మీకు సమాధి కాబోతున్నాయంటూ హెచ్చ‌రించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com