ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 04:59 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు హిందూపురం పట్టణానికి చెందిన అబ్రార్ తన ఇద్దరు మిత్రులతో ద్విచక్ర వాహనంలో వెళుతూ లేపాక్షి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులు పెట్రోల్ పోయించుకుని రోడ్డుపై వచ్చాడు. 


చిలమత్తూరు నుండి హిందూపురం కి వెళ్తున్న ప్రైవేటు బాలాజీ బస్సు తప్పించ బోధ ద్విచక్ర వాహనం ముందు చక్రాల మీద పడింది దీంతో అబ్రార్(22) తల బస్సు చక్రం కింద పడి నుజ్జునుజ్జ అయింది. ద్విచక్ర వాహనం లో ఉన్న యూనుస్, ఆయాజ్ లెక్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అదేవిధంగా చిలమత్తూరు నుండి హిందూపురం తన ద్విచక్ర వాహనంలో వెళుతున్న రాజారెడ్డి బస్సుకు వెనక వైపు నుండి గుద్దడం తో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com