ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 02:28 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వైసిపి కార్యకర్త వెంకటేష్ ఆచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పనపాకం పంచాయతీ కొత్తపేటలో తన ఇంటి పక్కనే కొన్న స్థలాన్ని స్థానిక వైసిపి నేతల సాయంతో కొందరు ఆక్రమించుకుంటున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. పనపాకం గ్రామంలో నాయకుల హామీతో రోడ్డు పనులు చేస్తే రూ. 6 లక్షలు అప్పులు మిగిలాయని వాపోయారు. రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనోవేదన గురయ్యానని పురుగుల మందు డబ్బా చేతబట్టుకుని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. నా చావుకు అధికారులు, కొందరు స్థానిక నేతలే కారణమని ఆరోపించారు. సెల్ఫీవీడియోను కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు బాధితుడు వెంకటేష్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com