గుంతకల్లు పట్టణంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్ కూడలిలో గత రెండు రోజుల ఒక మహిళను తాళ్లతో కట్టి దాడిచేసిన ఘటనలోఏడుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు ఒకటవ పట్టణ సిఐ. నాగశేఖర్, ఎస్సై కొండయ్య లు విలేకరుల సమావేశంలో తెలిపారు.
సిఐ తెలిపిన మేరకు వివరాలు పట్టణంలోని ఆర్. అండ్. బి కూడలిలో గత రెండు రోజుల క్రితం ఓ మహిళ మోహన్ అను వ్యక్తితో అక్రమ సంబంధం కొనసా గిస్తుందన్న ఆరోపణతో స్థానిక బెంచి కొట్టాలకు చెందిన మోహన్ కుటుంబ సభ్యులు మీనుగ రాజమ్మ, శ్రీదేవి, రాధా కృష్ణ, మీనా కుమారి, అమూల్య, హెచ్. కార్తిక్, ఎస్. నాగరాజు లు సదరు మహిళ ఇంటికి వెళ్లి గొడవపడి ఆమెను తాళ్లతో కట్టివేసి దాడిచేసారన్నారు.
ఈ ఘటనపై బాధిత మహిళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని సిఐ తెలిపినారు.