అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని వడ్లపాలెంకు చెందిన నాగ వినోద్ (31) అదృశ్యమయ్యాడు. పట్టణ పోలీసుల వివరాల మేరకు. వడ్లపాలెంకు చెందిన నాగవినోద్ సిగరెట్, బీడీల వ్యాపారం చేస్తుండేవాడు. ఈ నెల 15న వ్యాపార నిమిత్తం ఇంట్లో నుంచి రూ. 1. 70 లక్షలు నగదును తీసుకొని వెళ్లి, తిరిగి రాకపోవడం తో అతని తల్లిదండ్రులు ఆచూకీ కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.
![]() |
![]() |