అనంతపురం జిల్లా కదిరి పట్టణములో ప్రమీల అనే మహిళ సోమవారం హత్యకు గురైంది. మృతురాలు ప్రమీల కాలేజీ సర్కిల్ సమీపంలోని రామాంజనేయ జనరల్ స్టోర్ నడుపుతోంది. ప్రమీల భర్త ఏడాది కిందటే చనిపోవడంతో ప్రమీల ఒంటరిగా ఉంటుంది. ఉదయం షాప్ కి పని మనిషి వెళ్లేసరికి ప్రమీల నిర్జీవంగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు రాత్రి 9 నుండి 10 గంటల సమయంలోనే ప్రమీల హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆస్తి తగాదాలే ప్రమీల హత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. విచారణ చేస్తున్నామని హత్య గల కారణాలు తొందర్లోనే తెలుస్తాయని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.
![]() |
![]() |