ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటగిరిలో యువతి గొంతు కోసిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 11:55 AM

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ప్రేమించలేదని ఓ యువతి గొంతు కోశాడు. వెంకటగిరికి చెందిన చెంచుకృష్ణ అనే యువకుడు... కొద్దిరోజులుగా అదే పట్టణానికి చెందిన యువతిని వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి 


కుటుంబసభ్యులు చెంచుకృష్ణను మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ రోజు ఏకంగా యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడే చాకుతో యువతి గొంతు కోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి కల్లు తాగాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి... తలుపు వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.... తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com