అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి లో స్థానిక కూరాకు పేటలో నివాసముంటున్న సాదిక్ (30) అనే యువకుడు శనివారం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతిచెందాడు. ఎస్ఐ మునీర్అహ్మద్ తెలిపిన వివరాల మేరకు పెనుకొండకు చెందిన అజీం, సుల్టాన్ దంపతుల కుమారుడు సాదిక్ తమ్ముడు సద్దాంతో కలిసి బంధువుల ఇంటిలో నివాసముండేవారు. అయితే సాదిక్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.