ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెవులు లేకుండా శిశువు జననం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 11:45 AM

విశాఖలో ఓ శిశువు జననం అందరిని ఆశ్చార్యానికి గురిచేసింది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలకు రెండు చెవులూ లేకుండా మగబిడ్డ జన్మించాడు. ఈ నెల 18వ తేదీన నాగమణి పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమె బిడ్డను ప్రసవించారు.


చెవులు లేకుండా జన్మించిన శిశువును చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన పరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకరప్రసాద్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com