అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం దేవస్థానములలో కదిరి పౌర్ణమి సందర్భంగా ఉదయం 8 గంటలకు నిత్య పూజ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార తిరుమంజనం, పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. అలాగే సాయంత్రం 5 గంటలకు నీలకంఠాపురం కాలనీ నుండి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తి ని గ్రామస్తులు మేళతాళాలతో ఊరేగింపుగా నీలకంఠాపురం దేవాలయం చేరుకొని అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తి తో పాటు ఆలయ వీధుల్లో ప్రకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం అర్చకులు మహామంగళహారతి, భక్తులకు తీర్థ ప్రసాద అందచేశారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరా దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]() |
![]() |