అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో నూతన టూటౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిలు శనివారం పరిశీలించారు. నూతన పోలీసు స్టేషన్ భవన నిర్మాణ స్థల సేకరణ కోసం మార్కెట్ యార్డులో జిల్లా ఎస్పీ, ధర్మవరం ఎమ్మెల్యేలు పర్యటించారు. మార్కెట్ యార్డు అనువైన ప్రాంతం కావడంతో ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఎస్పీ, ఎమ్మెల్యేల వెంట ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, మున్సిపల్ కమీషనర్ మల్లికార్జున, సి. ఐ లు కరుణాకర్, మన్సురుద్ధీన్, రెవెన్యూ అధికారులు, తదితరులు వెళ్లారు.
![]() |
![]() |