కల్తీ సారా మద్యం పై నిరసన ర్యాలి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిరలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు , మాజీ మంత్రి అచ్చెం నాయుడు ఆదేశాల ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర పట్టణంలోని అమరాపురం బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కలిసికల్తీ సారా మరణానికి కారకులైన వైసిపి నేతలను వెంటనే కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనోహర్, కౌన్సిలర్లు నరసింహరాజు, ఉమాశంకర్ , శ్రీనివాసులు. ప్రభావతి , శీన, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, పుట్టపర్తి జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షుడు భక్తర్ , తేదేపా జడ్పిటిసి అభ్యర్థి నరేష్ (కన్నా) , మాజీ మున్సిపల్ చైర్మన్ లు రాజా , సుబ్బరాయుడు, తెలుగు యువత నాయకుడు తిమ్మరాజు , తెదేపా సర్పంచులు , వైస్ సర్పంచులు , తెదేపా నాయకులు రవీంద్ర రెడ్డి , నాగిరెడ్డి , మార్కెట్ బాబు, ఎగ్ నాగరాజు , లక్ష్మీపతి , మూర్తి , పాల రామాంజనేయులు , శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ , వెంకట్ రాజు, ఓబన్న, నాయకులు , కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు ,
![]() |
![]() |