అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పులివెందుల రూరల్ సీఐ బాలమద్దిలేటి రౌడీ షీటర్లను హెచ్చరించారు. శుక్రవారం లింగాల స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లాఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు లింగాల మండల పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ బాలమద్దిలేటి, ఎస్పై హృషి కేశవ రెడ్డితో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో చిన్నచిన్న వాటికి ఘర్షణలు పడకుండా. సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే మట్కా, గ్యాంబ్లింగ్, అక్రమ మద్యం, నాటుసారా, తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.