మాధవరం పోలీస్ స్టేషన్ లో మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామానికి చెందిన దళిత మహిళ ను నడిరోడ్డు మీద అవమానించి పట్టుకొని రవిక చింపి కొంగు లాగి మెడకు టవల్ తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసిన బోయ తిమ్మప్ప పై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేస్తే రెండు రోజులు నుంచి సివిల్ పంచాయితీ చేసి ఎఫ్ఐఆర్ చేయకుండా మాధవరం ఎస్ఐ నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనికి శాంతియుత నిరసనగా సాయంత్రం 7 గంటల నుండి మాధవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా బాధితురాలు, ప్రజా సంఘాలు బిస్మించి కూర్చున్నారు.
ఇంత వరకు ఎస్ఐ పట్టించుకోవడం లేదు. చావో రేవో అంటున్న దళిత బాధితురాలు ఇప్పటికీ ఇంకా పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలుపుతున్నారు. ఎట్టకేలకు 11 గంటలకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఉద్యమం కొనసాగించాలని కోరుతున్నారు.