జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామం లో కంపచెట్ల లో దాచిన 80 బస్తాల రేషన్ బియ్యాన్ని చాటుగా తరలిస్తుండగా జూపాడుబంగ్లా ఎస్ఐ వెంకటసుబ్బయ్య దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శనివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెలుగోడు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు గ్రామంలో రేషన్ కార్డు దారుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి నంద్యాలలో బొరుగులు తయారు చేసే వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఎస్ ఐ తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు