తుగ్గలి మండల పరిధిలోని రోళ్లపాడు తండాకు చెందిన శ్రీరామ్ నాయక్ (20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. రోళ్లపాడుకు చెందిన శ్రీరామ నాయక్ కర్నూలులో కూలిపని చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించేవాడు. అయితే ఈనెల 16వతేదీన కర్నూలు పట్టణంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, సీపీఐ మండల కార్యదర్శి రోళ్లపాడు వెంకటేష్, మాజీ సర్పంచు. పక్కీరప్ప, తదితరులు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.