హొళగుంద మండలం గజ్జహళ్లిలోని పోతప్ప వంకలో మొసలి ఉన్నట్లు కలకలం రేగింది. గ్రామంలోని శ్రీనివాసరెడ్డికి చెందిన ఆవు పోతప్ప వంకలో మృతి చెంది పడి ఉంది. ఆవు మొసలి దాడి చేయడం వల్లే చనిపోయినట్లు పుకార్లు రావడంతో విషయాన్ని సర్పంచ్ కుమారుడు గిరి ఆలూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణనాయక్, వెటర్నరీ డాక్టర్ సోమశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆవు మృతికి ముసలి కారణం కాదని, ఇతర కారణాలతో మృతి చెందిందన్నారు.