రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఆదోని పట్టణంలో వంట నూనె ధర నెల రోజుల్లో రూ. 100కు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఆయిల్ దుకాణ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టమొచ్చిన రీతిలో ధర పెంచి విక్రయిస్తున్నా అధికారులు దాడులు జరపకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. లీటర్ ధర రూ. 200 వరకు ఉందని, కొనలేక తప్పని పరిస్థితుల్లో తీసుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో దాడులు నిర్వహించి వంటనూనె ధరను నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు.
![]() |
![]() |