నందికొట్కూర్ పట్టణంలోని సాయిబాబా పేట లో నవనంది స్కూల్ సమీపంలో ఉన్న ట్యూషన్ కు వచ్చే విద్యార్థినిలకు ఆకతాయిల వేధింపులు మితిమీరి పోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉదయము సాయంత్రము ఆకతాయిలు మోటార్ సైకిల్ పై వెళుతూ ట్యూషన్ విద్యార్థులపై కోడిగుడ్లు ఎల్లిపాయ బాణాలు విసిరి వేస్తున్నారు.
గతంలో చాలాసార్లు ఇదేవిధంగా జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాత్కాలికంగా చర్యలు తీసుకున్న ఫలితం దక్కడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.
గురువారం రాత్రి ఆకతాయిలు విద్యార్థులపై వెళ్లడంతో ఈ సమస్యను మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో చదువుతుండగా ఆకతాయిలు వేధింపుల వల్ల విద్యార్థులు భయాందోళన అవుతున్నారని జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
![]() |
![]() |