పండుగల సందర్భంగా తిరుమలలో శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశామని వివరించారు. వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
![]() |
![]() |