ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 02:42 PM

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఎర్రగుంట్ల మండలానికి చెందిన మైనర్​పై.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను.. నిందితుడు ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు.అనంతరం ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు మొదట ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడి నుంచి ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు కేసును బదలాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com