ఏపీలోని కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను కువైట్‌లో ముగ్గురి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్, అతని భార్య స్వాతి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. వెంకటేశ్ ఓ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కువైట్‌లోని ఆర్దియా ప్రాంతంలో ఓ ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. వెంకటేష్ పై ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం వెంకటేశ్‌ని కువైట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలులో వెంకటేశ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కువైట్ పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన భర్తను కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారని వెంకటేష్ భార్య స్వాతి ఆరోపిస్తున్నారు. అక్కడ జరిగిన మూడు హత్యలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వెంకటేశ్ ఈ హత్యలు చేయలేదని, సాక్ష్యాధారాలు లేకనే వారే తమ కుమారుడ్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వెంకటేశ్ తండ్రి ఆరోపిస్తున్నారు.
![]() |
![]() |