మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నందు ఇకపై ఉపాధి కూలీలకు సంబంధించి మేటిలే కీలకమని బ్రహ్మంగారి మఠం మండల ఉపాధి హామీ ఏపీఓ వసంత కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఉపాధి కార్యాలయం నందు వారు మాట్లాడుతూ. ఈ ఏడాది నుండి కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించిన విధానాలను మార్పులు చేయడం జరిగింది అన్నారు.
అందులో భాగంగానే ఉపాధి పనులు చేయదలచిన
వారు ముందుగా డిమాండ్ నోటీసు ఇవ్వాలని, తదుపరి మస్టర్ దేశమంతా ఒకే విధానం అవలంభిస్తుందని అన్నారు. మస్టర్ నందు కూలీల సంతకం వారానికి ఒకమారు మాత్రమే చేయాల్సి వుంటుంది. డిమాండ్ ఇచ్చిన తర్వాత ఉపాధి పనికి వెళ్లినా, వెళ్లక పోయినా తమకు కేటాయించిన 100 రోజుల్లో పని దినాలు తగ్గుతుంటాయి.
ప్రతి కూలికి తప్పని సరిగా 245 రూపాయలు దినసరి కూలి వస్తుందని, ఒక పూట ఆ కూలి వర్తించక పోయినా, మధ్యాహ్నం కూడా పనికి వెళ్లే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం ఉపాధి పనుల ద్వారా నీటి కుంటలు, ఖండిత కందకాలు, డకౌట్ పనులు, చెక్ డ్యామ్, కాలువలు పూడికతీత లాంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి పనికి వెళ్ళే కూలీలకు ఒకొక్కరి నుంచి 3 రూపాయలు మేటికి వర్తిస్తుంది అన్నారు.
కూలీలకు గడ్డపారతో చేసే వారికి 15 రూపాయలు,
10 కిలోమీటర్ల దూరంలో ఉపాధి పనులు చేపడితే
కూలిలో 25 శాతం అదనంగా జమ అవుతుందన్నారు. రోజుకు మేటికి మొత్తంగా రూ 410 పైగా దినకూలీ వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. గత ఏడాది 8095 మంది ఉపాధి పనులకు వెళ్లే వారని, ఈ నెలలో ఉపాధి పనులు ప్రారంభించామని, వచ్చే నెల్లో పూర్తిస్థాయి పనులు చేపడుతామన్నారు.
![]() |
![]() |