రోడ్డు ప్రమాదంలో సి. ఆర్. పి. ఎఫ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బూర్లి రామకృష్ణ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గజపతినగరం జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. రామకృష్ణ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న గజపతినగరం 108 సిబ్బంది ఈ. ఎం. పి కె. కుమారి, పైలెట్ సత్యనారాయణ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.