విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అడ్డురువాని పాలెం గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . వివరాల్లోకి వెళితే విశాఖపట్నం , అరకు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఢీ కొనడంతో ఆ ఇద్దరు యువకులు సంఘటనా స్థలం వద్దనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం స్థానిక పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.