తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేతులైన స్వామివారు... కోనేటిలో నిర్మించిన తెప్పపై మూడుమార్లు విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకారభూషితులైన ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు... కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తిసంకీర్తనల మధ్య... తెప్పోత్సవం వైభవంగా సాగింది. అంతకుముందు... అమ్మవార్లతో కలసి తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామివారు పుష్కరిణికి చేరుకున్నారు.
![]() |
![]() |