ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్.డి.ఎమ్ లు ఆలసత్వం వహిస్తున్నారని కార్డుదారులు చోబుతున్నారు. ఎర్రగొండపాలెం మండలంలో ప్రతి నెల 1వ తేదీ నుండి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ కార్యక్రమంలో అందరూ నివాసాల వద్దకు వెళ్లడం లేదని, వెళ్లిన పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ చేయడం లేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. డీలర్ వద్దనే నెల తీసుకునే విధానం బాగుందని కార్డుదారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పంపిణీ మాటున బియ్యం పక్కదారి పడుతున్నాయని కార్డుదారులు చోబుతున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే సమయంలో వాలంటర్, రెవెన్యూ శాఖ సిబ్బంది ఉండాలి కానీ వారు ఇరువురు ఈ పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ కనిపించడం లేదంటున్నారు. ఇలా అయితే కార్డుదారులకు పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు అందడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని లేకుంటే పూర్తి స్థాయిలో డీలర్ వద్దనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కార్డుదారులు, ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |