ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:42 PM

కృష్ణాజిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్సిపి ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి ని ప్రశ్నోత్తరాల లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయమని ప్రశ్నించడం జరిగింది.


అందుకు సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి దేశంలో అటవీ ఉత్పత్తుల వ్యవసాయం పెరగడం, ప్రత్యేకంగా చిన్న / సన్న కారు రైతులు దేశీయ మొక్కలైన ఎర్ర చందనం, టేకు, నేరేడు, ఉసిరి, వేప, పనస, చింత, మారేడు తదితర వృక్ష జాతుల పెంపకాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది.


ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో 2016-17 ఆర్ధిక సంవత్సరం నుండి అమలులో ఉన్నది. ఆ సంవత్సరం లో 6. 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా ₹ 3. 15 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో ₹ 2. 83 కోట్ల రూపాయలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారు 2016-17 ఆర్ధిక సంవత్సరం నుండి 2018-19 ఆర్ధిక సంవత్సరం వరకు వినియోగించుకొన్నారు. తరువాతి సంవత్సరాలలో కూడా ఈ పధకం కొరకు నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఏమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్ధిక సంవత్సరాలు 2019-20, 2020-21 మరియు 2021-22 లకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలను ఈ పధకం కింద సమర్పించబడి ఉండలేదని మంత్రి వర్యులు తెలియచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com