నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రధాన గ్రామాల్లో సీసీ డ్రైన్లు నిర్మాణానికి ఉపాధి నిధుల నుంచి రూ. 5. 25 కోట్లు మంజూరయ్యాయని పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య తెలిపారు. నరసన్నపేట టౌన్ లో నాలుగు పనులకు రూ. 60 లక్షలు, రూరల్ గ్రామాల్లో 29 పనులకు రూ. 2. 40 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే జలుమూరు మండలంలో 27 పనులకు రూ. 2. 37కోట్లు, సారవకోట మండలంలో 21 పనులకు రూ. 1. 86 కోట్లు, పోలాకి మండలంలో 5 పనులకు రూ. 42 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులు త్వరితంగా గ్రౌండ్ చేసి ప్రారంభించాలన్నారు. పనులు తొందరగా పూర్తిచేస్తే బిల్లులు వెంటనే విడుదల అవుతాయన్నారు. సంబంధిత ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలతో సంప్రదించి పనులు చేపట్టాలన్నారు.
![]() |
![]() |