అదనపు కట్నం కోసం భర్త, అత్తంటి వారు వేధిస్తున్నారని సారవకోట మండలంలోని గుమ్మపాడు పంచాయతీ అక్కివలస గ్రామానికి చెందిన నెయ్యిల ప్రమీల సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి జరిగి ఆరేళ్లు అయినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త నెయ్యిల అర్జున్ పాటు కుటుంబ సభ్యులు నెయ్యిల వనజాక్షి, నెయ్యిల రమణ, నెయ్యిల కుంటిమ్మ వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి. లావణ్య తెలిపారు.
![]() |
![]() |