శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కుసుమపోలవలస గ్రామానికి చెందిన బంటుపల్లి రాంబాబు పెంచుతున్న కోడికి నాలుగు కాళ్లతో పిల్ల జన్మించింది. ఈ చిత్రాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు ఎగబడ్డారు. ఈ విషయాన్ని పశువైద్యాధి కారి లక్ష్మీప్రియ వద్ద ప్రస్తావించగా జన్యు పరమైన లోపంతో ఇలా పుట్టిందని, సాధారణ కోడిలా పెంచుకోచ్చునని చెప్పారు.