స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు రూయూరల్ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తన వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా బైరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మరింత మంది క్రీడాకారులు తయారు కావాలని బైరెడ్డి ఆకాంక్షించారు.