ప్రకాశం: పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో అక్రమ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఆదివారం పొన్నలూరు ఎస్సై టి రమేష్ బాబు తమ సిబ్బందితో కలిసి అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి ని అరెస్ట్ చేసి 32 బాటిళ్ళను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ టి రమేష్ బాబు మాట్లాడుతూ పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.