ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో 96 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 02:38 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) కమిషనర్‌ కార్యాలయం.. విజయనగరం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 96 ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్‌, ఆడియోమిట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, బయోమెడికల్ ఇంజనీర్లు, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్ పోస్టులలో ఖాళీలు ఉన్నాయి.


దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలని తెలిపారు.


అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి 23 లోపు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ విజయనగరంలో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/ ఓపెన్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com