శ్రీకాకుళం: మాత్యకారుల వలలో భారీ తిమింగలం చిక్కింది. ఎం.మరువాడ గ్రామంలో శుక్రవారం స్థానిక మత్యకారులు వేట వెళ్లారు. వల భారీ బరువుగా రావటంతో వారి పంట పండిందని అనుకున్నారు. వలను తీరం చేర్చాక లోపల ఉన్న భారీ తిమింగలం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వలలో ఉన్న కొద్ది చేపలను కూడా ఆ భారీ చేప తినేసిందని వాపోయారు. చేసేది లేక ఆ భారీ చేపను మళ్ళీ సముద్రంలోకి పంపించటానికి చాలా శ్రమించి మళ్ళీ సముద్రంలోకి పంపించారు. ఈ భారీ తిమింగాలు చిన్న చేపలను వేటడాటానికి వచ్చి ఈ వలలో చిక్కుకుపోయిందని, వేటగాళ్ల వలను కూడా చాలా వరకు చించి నష్టం కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
![]() |
![]() |