శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ సముద్రం తీరంలో నిర్మించనున్న అణు విద్యుత్ కేంద్రం పై మరోసారి పార్లమెంట్ లో మరోసారి చర్చకు వచ్చింది. అమెరికా సహకారంతోనే అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ. మొత్తం ఆరు రియాక్టర్లతో 1, 208 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
అయితే దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ను కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు.
![]() |
![]() |