శ్రీకాకుళం: రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావు పెద్ద కుమారుడు శివాజీ వివాహానికి ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు రామారావు, చామంతి దంపతులు తాడేపల్లి వెళ్లి మొదటి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ఈ నెల 10 న వివాహం, 23 న వివాహ రిసెప్షన్ ఉందని తెలియజేయడంతో రిసెప్షన్‌కు వస్తానని సీఎం చెప్పినట్లు రామారావు స్థానిక విలేకర్లకు తెలిపారు.