సంక్రాంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి బుల్లెట్ పై గ్రామంలో తిరుగుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో తన భర్తతో బుల్లెట్ పై గ్రామంలో తిరుగడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. శత్రుచర్ల వైయస్ జగతి చిల్డ్రన్స్ పార్క్ లో కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషుల సమక్షంలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.
![]() |
![]() |