ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి రాశిఫలాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 12:56 PM

మేషం : మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *ఆంజనేయ ఆరాధన శుభప్రదం.


వృషభం: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. *ఆదిత్య హృదయం పఠించాలి.


మిధునం : ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం  అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. *ఆదిత్య హృదయ పారాయణ మంచిది.* 


కర్కాటకం : ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. *ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.* 


సింహం : అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. *లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.


కన్య : శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.


తుల : అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. *లక్ష్మీదేవి ఆలయ దర్శనం శుభప్రదం.* 


వృశ్చికం : ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనః స్సౌఖ్యం ఉంది. *నవగ్రహ ధ్యానం శుభప్రదం.* 


ధనుస్సు : మనఃస్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. *శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.* 


మకరం : శుభకాలం ఉంది. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. *ఆదిత్య హృదయం చదివితే  మంచిది.* 


కుంభం : శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. *ఇష్ట దైవాన్ని స్మరించండి.* 


మీనం : మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *గోవింద నామాలు చదివితే మంచిది.* 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com