టమాటా ధర కిలో రూ. 20-25 వరకు ఉండేది. కొన్ని జిల్లాల్లో పంట బాగా పండి ధరలేక రహదారులపై పారబోసిన రోజులున్నాయి. అలాంటిది దీని ధర ఇప్పుడు మండిపోతోంది. రాజోలు, మలికిపురంలోని మార్కెట్లో శనివారం కిలో రూ. 130 పలికింది. మన జిల్లాకు ఎక్కువగా దిగుమతయ్యే రాయలసీమలో వరదల కారణంగా పంట పాడైందని, అందుకే ధర అమాంతం పెరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.