వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 28, 2021, 11:07 AM
 

మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేయడంతో పులివెందులతో పాటు కడప జిల్లాలో కలకలం రేగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మరి కొందరిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో పులివెందులలోని సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అనుమానితుల్లో ఆందోళన మొదలైంది. విచారణ ఎదుర్కొన్న కొందరు అధికారపార్టీ నేతలు కూడా భయందోళన చెందుతున్నట్లు సమాచారం.