నేడు ఏపీ కేబినెట్ భేటీ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 28, 2021, 10:18 AM
 

నేడు ఏపి కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో…అన్లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలకు ఆర్డినెన్స్ కు అమోదం తెలపనున్నారు. సినిమాటోగ్రఫి చట్టానికి సవరణ కు అర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై కూడా చర్చ జరగనుంది. అదే విధంగా టీటీడీలో ప్రత్యేక అహ్వానితుల నియామకం పై కూడా చర్చించనున్నారు.ప్రత్యేక అహ్వానితుల కోసం చట్ట సవరణ.. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ పై చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీవింగ్‌ ఏర్పాటు పై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు పై కూడా నేడు కేబినెట్ చర్చించనుంది.