శ్రీవారికి 3.6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 08:01 PM
 

తిరుమల శ్రీవారికి బుధవారం బంగారు బిస్కెట్లు విరాళంగా అందాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కంపెనీ ప్రతినిధులు శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువైన 3.604 కేజీల బంగారు బిస్కెట్లు కానుకగా అందించారు. ఈ బిస్కెట్లను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.