బద్వేల్‌ బీజేపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలిసులు మోహరింపు

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 07:38 PM
 

కడప జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న బద్వేల్‌లోని బీజేపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ మీదుగా వైసీపీ కార్యకర్తలు రోడ్‌ షో నిర్వహించారు. వైసీపీ రోడ్‌షోకు పోటీగా బీజేపీ కార్యకర్తలు జెండాలు ఊపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బద్వేల్‌ బీజేపీ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు