ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టి20 ప్రపంచకప్‌ 2021:నవ్వులు పూయించింన కన్‌ఫ్యూజ్‌ రనౌట్‌.. ఇంగ్లండ్‌ ఆటగాడి డ్యాన్స్‌

national |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 06:09 PM

టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఒక కన్‌ఫ్యూజ్‌ రనౌట్‌ నవ్వులు పూయించింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్‌ వేశాడు. ఓవర్‌ నాలుగో బంతిని కెప్టెన్‌ మహ్మదుల్లా షార్ట్‌ఫైన్‌ లెగ్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న టైమల్‌ మిల్స్‌ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మిస్‌ఫీల్డ్‌ జరిగింది. ఇక్కడే మహ్మదుల్లా రెండో పరుగుకోసం యత్నించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఆఫిఫ్‌ హొస్సేన్‌ సగం క్రీజువరకు వచ్చేశాడు. దీంతో మిల్స్‌ బంతిని వేగంగా బట్లర్‌కు త్రో విసిరాడు. అంతే హొస్సేన్‌ క్రీజులోకి చేరేలోపే బెయిల్స్‌ ఎగరడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఈ కన్‌ఫ్యూజ్‌ రనౌట్‌తో ఇంగ్లండ్‌ ఆటగాడు డ్యాన్స్‌ చేయడం మిగతావారికి నవ్వులు పంచింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com