ఏపీ కరోనా అప్డేట్

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 06:07 PM
 

ఏపీలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,64,854 కేసులు నమోదు కాగా... 20,45,713 మంది కోలుకున్నారు. మొత్తం 14,364 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.