టీటీడీ బోర్డులో నేరచరిత్రుల నియామకం పై హైకోర్టు ఆగ్రహం

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 05:11 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.