విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయ : దేవినేని ఉమ

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 05:10 PM
 

చంద్రబాబును టెర్రరిస్టు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... ఈ వ్యాఖ్యలపై స్పందించి ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఏ ఆధారాలతో చంద్రబాబును విజయసాయిరెడ్డి టెర్రరిస్టు అన్నారని దుయ్యబట్టారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయి నుంచి చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా? అని దుయ్యబట్టారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఇలా మాట్లాడటం దారుణమని అన్నారు.